statue Of Equality | శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం | today | Sri vishnu sahsra namam stotra parayanam


 Ramanuja Sahasrabdi Samaroham  Celebrations LIVE From Muchintal | శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం విశేషాంశాలు❖❖❖❖❖❖

ఉదయం :

* ఇష్టిశాల : ఐశ్వర్యప్రాప్తికై - శ్రీలక్ష్మీనారాయణేష్టి, 

సత్‌సంతానమునకై - వైనతేయేష్టి

* ప్రవచనమండపము : శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తరశతనామపూజ, 

ప్రవచనములు

ప్రవచనమండపము : ముఖ్యఅతిథుల సందేశములు


❖❖❖❖❖❖జై శ్రీమన్నారాయణ !❖❖❖❖❖❖

* విశిష్టాద్వైతానికి మహోన్నత పీఠం.. ఆకాశాన్నంటే శ్రీభాష్యకారుని దివ్యరూపం..!

* 108 దివ్యదేశాల అద్భుత దర్శనం.. అరుదైన శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగం..!

* అతిరథ మహారథుల ఆగమనం.. ప్రతిక్షణం.. ఓ అద్భుతం..!

* కనీవినీ ఎరుగని ఆధ్యాత్మిక సంరంభం.. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం..!

* ఆధ్యాత్మిక పరివర్తన క్షేత్రం.. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చిరకాల స్వప్నం..!

* సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం.. 108 దివ్యదేశాల భవ్య దర్శనం..!

* ఐదువేల మంది ఋత్వికులచే శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు..!

* 10 కోట్ల అష్టాక్షరీ మహామంత్ర పారాయణం..!

* 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ, సమున్నత స్ఫూర్తి ప్రదాత సమతామూర్తి లోకార్పణ..!

* శ్రీ రామానుజాచార్యుల వారి స్వర్ణ ప్రతిమ ఆవిష్కరణ..!

* 216 అడుగుల శ్రీమద్ రామానుజాచార్యుల వారి విగ్రహ ఆవిష్కరణ..!

* జయహో రామానుజ.. ప్రత్యక్ష ప్రసారాలు.. ప్రత్యేక కార్యక్రమాలు..!


❖❖❖Venue❖❖❖

"శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం"

ఫిబ్రవరి 2 నుండి 14 వరకు (ముచ్చింతల్ దివ్య సాకేతం),

రామానుజాచార్యులవారి మాటలు❖❖❖❖❖❖

"అందరి దుఃఖాలు దూరం చేయడానికి నేనొక్కడినీ నరకంపాలైనా ఆనందంగ అంగీకరిస్తా"

"మాధవుని ముందు మనుష్యులందరూ సమానులే"

"ఆతని నామాన్ని పలికే అధికారం అన్ని కులాలకీ ఉంది"

"ఆతని ఆలయం ప్రవేశించే అర్హత కులాలకు అతీతంగా అందరిదీ"

-------------------------❖-------------------------------

* జనావాసానికి దూరంగా చీకటి బ్రతుకుల్లో మ్రగ్గుతున్న దళితులనీ, దీనులనీ మంత్రోపదేశంతో తరింపచేసి, వేదసారార్థ జ్ఞానంతో అందరినీ వైష్ణవులుగ తీర్చిదిద్దిన సమసమాజ నిర్మాత "శ్రీ రామానుజాచార్య స్వామి". 

* ప్రపంచ చరిత్రలోనే పండితులకీ, పామరులకీ, ప్రశాసకులకీ, పాలకులకీ మధ్య సుందర సేతువును నిర్మించి విశ్వ కుటుంబ భావనకు ఊపిరులూదిన సంఘసంస్కర్త "శ్రీ రామానుజాచార్య స్వామి". 

* వైదిక వాఙ్మయాన్ని శ్రద్ధాళువులైన సామాన్యులదాకా చేర్చిన ఆధ్యాత్మిక విప్లవ స్ఫూర్తి దాత "శ్రీ రామానుజాచార్య స్వామి". 

* మాయావాదాన్ని అణచి, భక్తి సామ్రాజ్యంలో వీరవిహారం చేసే వివిధ సాంప్రదాయ శాఖలకు శాస్త్రీయమైన ఆదిమూలము "శ్రీ రామానుజాచార్య స్వామి".





Comments